బ్యాక్అప్ తీయడం ఎలా
మీ ఫైళ్ళను మరియు అమరికలను బ్యాకప్ తీయుటకు సుళువైన మార్గం ఏదేని బ్యాకప్ అనువర్తనాన్ని మీ బ్యాకప్ కార్యక్రమం నిర్వహించుటకు అనుమతించడమే. చాలా విభిన్న బ్యాకప్ అనువర్తనాలు అందుబాటులోవున్నాయి, ఉదాహరణకు Déjà Dup.
మీరు ఎంచుకొనిన బ్యాకప్ అనువర్తనపు సహాయం అనునది బ్యాకప్ కొరకు మీ అభీష్టాలను అమర్చుటకు, అదేవిదంగా మీ దత్తాంశం తిరిగిపొందుటకు మార్గదర్శనంచేయును.
వేరొక ప్రత్యామ్నాయ ఐచ్చికం మీ ఫైళ్ళను నకలుతీయుట వేరే హార్డు డ్రైవ్‌కు, నెట్వర్కు నందలి వేరే కంప్యూటర్‌కు, లేదా USB డ్రైవ్‌కు. మీ వ్యక్తిగత ఫైళ్ళు మరియు అమరికలు సాధారణంగా మీ నివాస సంచయం నందు వుంటాయి, కనుక అక్కడనుండి మీరు నకలు తీయవచ్చు.
మీరు బ్యాకప్ తీయాలని అనుకుంటున్న పరిమాణం మీ నిల్వ పరికరం పరిమాణంకు పరిమితమై వుంటుంది. మీ బ్యాకప్ పరికరం పైన మీకు జాగా వుంటే, కింది వాటిని విస్మరించి మీ మొత్త నివాస సంచయం బ్యాకప్ తీయుట మంచిది.
ఇప్పటికే వేరే చోటకి, CD, DVD, లేదా ఇతర మాధ్యమం వంటివాటికి బ్యాకప్ తీసిన ఫైళ్ళు.
Files that you can recreate easily. For example, if you are a programmer, you do not have to back up the files that get produced when you compile your programs. Instead, just make sure that you back up the original source files.
చెత్త సంచయం నందలి ఏ ఫైళ్ళైనా. మీ చెత్త సంచయం ~/.local/share/Trash నందు వుంటుంది.