ఏమి బ్యాక్అప్ చేయాలి

మీ అతిముఖ్యమైన ఫైళ్ళు అదే విధంగా తిరిగిసృష్టించుటకు క్లిష్టమైన ఫైళ్ళను బ్యాకప్ తీయుట మీ ప్రాముఖ్యతగా వుండాలి. ఉదాహరణకు, అతిముఖ్యమైన వాటినుండి అంత ముఖ్యమైనవికాని వాటివరకు:

మీ వ్యక్తిగత ఫైళ్ళు

వీటిలో పత్రములు, స్ప్రెడ్‌షీట్లు, ఈమెయిల్, క్యాలెండర్ నియామకాలు, ఆర్ధిక దత్తాంశం, ఇంట్లో ఫొటోలు, లేదా తిరిగి పొందుటకు సాధ్యంకాని ఏ ఫైళ్ళైనా ఈ కోవలోకే వస్తాయి.

మీ వ్యక్తిగత అమరికలు

మీ డెస్కుటాప్ పైన రంగులకు, బ్యాక్‌గ్రౌండ్లకు, తెర రిజొల్యూషన్ మరియు మౌస్ అమరికలకు చేసిన మార్పులు దీని కిందకే వస్తాయి. అనువర్తన అభీష్టాలు, లిబ్రేఆఫీస్, మీ మ్యూజిక్ ప్లేయర్, మరియు మీ ఈమెయిల్ ప్రోగ్రామ్ వంటివాటి అమరికలు కూడా దీనికిందకే వస్తాయి. ఇవి తిరిగిపొందవచ్చు, అయితే తిరిగిచేయుటకు సమయం పడుతుంది.

వ్యవస్థ అమరికలు

చాలామంది సంస్థాపనా సమయమందు సృష్టించిన వ్యవస్థ అమరికలను మార్చరు. మీరు మీ వ్యవస్థ అమరికలను మార్చివుంటే, లేదా మీరు మీ వ్యవస్థను సేవిక వలె వుపయోగిస్తుంటే, అప్పుడు మీరు ఈ అమరికలను బ్యాకప్ తీయాలని అనుకోవచ్చు.

స్థాపించబడిన సాఫ్ట్‍వేర్

ఏదైనా తీవ్రమైన కంప్యూటర్ సమస్య తరువాత మీరు వుపయోగించే సాఫ్టువేర్ ను సాధారణంగా దానిని తిరిగిసంస్థాపించుట ద్వారా తిరిగివుంచవచ్చు.

సాధారణంగా, మీరు తిరిగిపొందుటకు సాధ్యంకాని ఫైళ్ళను మరియు బ్యాకప్ తీయకపోతే పునఃస్థాపించుటకు ఎక్కువ సమయం పట్టే ఫైళ్ళను మీరు బ్యాకప్ తీయాలనుకొంటారు. సుళువుగా పునఃస్థాపించుటకు వీలగు వాటిని బ్యాకప్ తీసి మీరు డిస్కు జాగాను వృధా చేయలనుకోరు.